clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

వీడియో విశ్లేషణ కోసం ఒక సాధనం


వీడియో విశ్లేషణ కోసం ఒక సాధనం


వాలుపై దొర్లే బంతి యొక్క వేగం విశ్లేషణ


 

ఇప్పటి వరకు మీరు ప్రయోగం చేసి బంతి సగటు వేగాన్ని లెక్కించారు. ప్రయోగం నుంచి మేన్యువల్ గా ఖచ్చితమైన డేటాని పొందటం కష్టమని కూడా మీరు గుర్తించి ఉండవచ్చు. దీనికి మీరు కారణాలు కూడా చర్చించారు.
 

ఈ కష్టాన్ని అధిగమించటానికి, మీకోసం మేము ఒక విశ్లేషణ సాధనం అభివృద్ధి చేసాం. విశ్లేషణ చేయటానికి కొన్ని ప్రీ-రికార్డెడ్ వీడియో క్లిప్స్ ని కూడా మేము మీకు ఫోల్డర్ లో ఇచ్చాం.
 

వీడియో ప్లేయర్ ఎలా పని చేస్తుంది?
 

ప్రతీ ఫిల్మ్ స్టిల్స్ ను సేకరిస్తుంది. ఈ స్టిల్స్ ని ఒక స్థిరమైన వేగంలో కలిపి నడిపితే మనం స్టిల్స్ కదలటాన్ని చూస్తాం.

ఫోల్డర్ లో వీడియో ప్రతీ సెకనుకి 30 ఫ్రేముల రేటు చొప్పున తీయబడింది. బిల్ట్ ఇన్ కమేండ్స్ "+" మరియు " - " లని ఉపయోగిస్తూ మీరు బంతి కదలికని ఒక్కొక్క ఫ్రేం ద్వారా కదపవచ్చు. అనగా మీరు బంతి స్థానాన్ని సెకను 1/30వ వంతు వద్ద చూడగలరు.

 

ఈ రకంగా మీరు కదలికని ఆపగలరు మరియు మీ సౌకర్యం ప్రకారం విశ్లేషణ చేయగలరు.  

ఇచ్చిన పట్టికలో మీరు బంతి సమయం మరియు స్థానాన్ని నమోదు చేయవచ్చు. గ్రాఫ్ ఆటోమేటిక్ గా ఉత్పన్నమవుతుంది. తదుపరి విశ్లేషణ కోసం మీరు మీ గాలరీలో సేవ్ చేయవచ్చు.

 

వీడియో విశ్లేషణ సాధనం యొక్క వివిధ భాగాల్ని అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఒక ట్యుటోరియల్ మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో ఇవ్వబడింది.
 

గమనిక: కొత్త విండోలో వీడియో టూల్ తెరవటానికి వీడియో అనలైజర్ టూల్ పై క్లిక్ చేయండి.
 


పైన మీరు చేసిన పని ఆధారంగా ఈ క్రింది వాటికి సమాధానం ఇవ్వండి:



డేటాని విశ్లేషణ చేయటం ద్వారా, చలన క్రమేణా సమయంతో పెరిగే చోట మనం కదలికని గుర్తిస్తాం.  వేగ వృద్ధిని నిర్వచించటానికి ఇదే రకమైన ప్రయోగాన్ని గెలీలియో ఉపయోగించారు.
 

[Contributed by administrator on 10. Januar 2018 21:47:14]