clix - Physics: Motion
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Physics: Motion

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

త్వరణంని లెక్కించటం ఎలా


త్వరణంని లెక్కించటం ఎలా

 

ఆంగ్ల భాషలో 'a' అనే అక్షరాన్ని త్వరణంకోసం ఉపయోగించబడింది మరియు a avg అనగా సగటు త్వరణం


వేగంలో మార్పుని కొంత సమయం వరకు పోల్చితే, కొంత సమయం వరకు వేగం మార్పు రేటుని మీరు పొందుతారు లేదా ఆ సమయంలో సగటు త్వరణం విలువని పొందుతారు.

కాబట్టి, సగటు త్వరణం = వేగంలో మార్పు/సమయంలో తేడా

 

aavg= Δv/Δt
aavg= v- v1/
t2t1
అనగా v1= ప్రారంభ వేగం

v2= చివరి వేగం

t1= ప్రారంభ పాయింట్ లో సమయం

t2= చివరి పాయింట్ లో సమయం

∆v మరియు ∆t  లు ప్రయాణం విషయానికి గాను వేగం మరియు సమయాల్లో మార్పు అని అర్థం.


వేగంలో మార్పు రేటు లేదా త్వరణం ఎంత తక్కువగా ఉంటే మీ ప్రయాణం అంత సాఫీగా ఉంటుంది. వేగంలో మార్పు రేటు లేదా త్వరణం ఎంత వేగంగా ఉంటే మీ ప్రయాణం అంత అసౌకర్యంగా ఉంటుంది.

ఒక రైలు సెకనుకి 60 Km/h వేగంతో ప్రయాణిస్తుంది. మధ్యాహ్నం 12:05కి, డ్రైవర్ ఒక స్థిరమైన రేటుతో ప్లాట్ ఫాం వద్ద రైలుని ఆపుచేయటానికి బ్రేకులు ఉపయోగించాడు. 12: 10కి రైలు ప్లాట్ ఫాం వద్ద ఆగింది. వేగంలో మార్పు రేటు ఏమై ఉండాలి(త్వరణం). అందువల్ల రైలు 5 నిముషాల్లో ఆగుతుంది?  

మనం సగటు వేగం సమీకరణం గురించి చర్చించాం. ఇక్కడ మనం అదే సమీకరణాన్ని ఉపయోగిద్దాం మరియు వేగం మార్పిడి రేటుని అనగా త్వరణంను లెక్కిద్దాం. రైలు వేగం 60 Km/h నుంచి గంటకు 0 Km/h తగ్గిపోతుంది.

సగటు త్వరణం సమీకరణం                                                     
                                                            aavg=Δv/Δt

                                                           aavg = (0-60) kilometer/hour / 5 minute

                                                            aavg = -12 km/hour/minute

 అయిదు నిముషాల్లో  ఆగటానికి  రైలు వేగం 12 కిమీ/గంటకు/నిముషానికి చొప్పున తగ్గిపోయి ఉంటుందని మీకు ఈ సమాధానం చెబుతుంది.

రుణాత్మక చిహ్నం రైలు వేగం తగ్గిపోతోందని సూచిస్తుంది.

రైలు  స్థిరమైన రేటేుతో 12కిమీ/గంటకు/నిముషానికి వేగం తగ్గిపోతే మనం ఈ విషయాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు

 

సమయం (నిముషాల్లో)

0

1

2

3

4

5

 వేగం (కిమీ/గంటకు)

60

48

36

24

12

0

పట్టిక 8.3: వేగం వెర్సెస్ సమయం
 

 

ఇక్కడ కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి:

[Contributed by administrator on 10. Januar 2018 21:47:02]