clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

3.1.2 రక్త ప్రవాహంపై ప్రభావం - ఎలా తనిఖీ చేయాలి

పైప్ యొక్క వ్యాసం - ఇది ప్రవాహంపై ప్రభావం చూపుతుందా


మన ఊహ అనుకుందాం - "ఒక ఇరుకైన వ్యాసం కలిగిన పైప్ రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది"
 

మనము దీనిని ఎలా పరీక్షిస్తాము?
 

దీనిని ఈ క్రింది ఇచ్చిన ఒక మార్గము ద్వారా పరీక్షించ వచ్చును -

దీని కొరకు మీకు కావలసినవి

- 2 బకెట్లు

- ఒక పాత ప్లాస్టిక్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ లాంటిది, నీరు బాటిల్ మొదలైన సులభంగా అణచివేయబడగలిగేవి.

- వివిధ వ్యాసాలతో కూడిన, 2 మీటర్లు వుండే రెండు పైపులు

1.  బకెట్లో ప్లాస్టిక్ బాటిల్ మునిగిపోవడానికి తగినంత నీరు ఉండేలా, బక్కెట్టును నీటితో నింపండి.

2. పైప్ మరియు ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. బాటిల్ లోపలకు పైప్ యొక్క ఒక చివరను ఉంచండి.

3. ఇప్పుడు నీటితో నింపిన బకెట్ లోపల, ప్లాస్టిక్ బాటిల్ మరియు పైపును ఉంచండి.

4. మీకు దగ్గరలో ఖాళీ బకెట్ ఉంచండి.

5. పైప్ యొక్క అవతలి చివరను తీసుకుని, ఖాళీ బకెట్ లో వ్రేలాడదీయండి.

6. ఇప్పుడు ఒక చేతితో ప్లాస్టిక్ బాటిల్ని పట్టుకోండి. సీసాను నీటి లోపలే ఉండేలా చూసుకోండి.

7. బాటిల్ని పదేపదే నొక్కండి. పైపు నుండి ఖాళీ బకెట్లోకి నీరు ప్రవహించడం ప్రారంభించడమును మీరు చూస్తారు.

 

ఈ విధముగా గుండె, రక్తమును పైపులలోకి పంపు చెస్తుంది. తరువాత రక్తమును, వివిధ అవయవాలకు  తీసుకుని వెళుతుంది.
 

8. ఒక నిమిషములో ఖాళీ బకెట్ లోకి ప్రవహించిన నీటిని కొలవండి.

9. వేరొక వ్యాసంతో వున్న రెండవ పైపుకు కూడా ఇదే విధానాన్ని పునరావృతం చేయండి

10. ఖాళీ బకెట్ లోకి ప్రవహించిన నీటిని కొలవండి.

మీ పరిశీలనలను ఇక్కడ వ్రాయవచ్చు -

bpexperiment

[Contributed by administrator on 14. März 2018 20:01:37]