clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

3.2.1 ధూమపానం చేసేవారి ఊపిరితిత్తులు

ధూమపానం


అనేకమంది యువతి-యువకులు వారి స్నేహితులను లేదా వారి చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావముతో, ధూమపానం మరియు పొగాకు నమలడం అనే హానికరమైన అలవా ట్లు మొదలు పెడతారు. ఈ అలవాట్లు వదిలివేయడం కూడా చాలా కష్టం. ధూమపానం లేదా పొగాకు నమలడం ప్రారంభించిన చాలా మంది వ్యక్తులు ఈ అలవాట్లను విడిచి పెట్టలేరు. ఇది ఒక వ్యసనము, అందువల్ల దీనిని మానేయడానికి కృషి అవసరం.

పొగాకును వాడుట వలన, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ధూమపానం ద్వారా వచ్చే హానికరమైన ప్రభావములు, అది తీసుకునే వ్యక్తులకు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా పొగ పీల్చుకోవడం వలన ప్రభావము పడుతుంది. దీనిని నిష్క్రియ ధూమపానం అంటారు.

ధూమపానం గురించిన కథను చదివి, దీని ద్వారా వచ్చే పొగను పీల్చుట వలన ప్రజల ఆరోగ్యము  ఎలా ప్రభావితం అవుతోందో పరిశీలిద్దాం.

నాకు 30 సంవత్సరములు. నేను, నా 16 సంవత్సరాల వయస్సు నుండి ధూమపానం చేస్తున్నాను. పాఠశాలలో, నా స్నేహితులలో చాలామంది ధూమపానం చేసేవారు. కమల్ భయ్యాతో, నా తొలి సిగరెట్ ను ప్రయత్నించాను. అతను నా పొరుగు ఇంటివాడు. ప్రతిదానికీ నేను, అతనిని అనుసరించేవాడిని. అతను చాలా మంచి వాడు. అతను ఆటల్లోనే కాకుండా, చదువు కూడా చాలా బాగా చదివేవాడు. అతను, మా పాఠశాల హాకీ జట్టు కోసం ఆడాడు.

మొదటి కొన్ని సంవత్సరాలు, నేను ప్రతిరోజుకు 4-5 సిగరెట్లు తాగేవాడిని. నేను ఇంటిలో ఎప్పుడూ ధూమపానం చేయలేదు. పాఠశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు, నా ఇంటి ముందు బస్ స్టాండ్ వద్ద నిలిచి, నా స్నేహితులతో కలిసి పొగ త్రాగేవాడిని.


నేను పని కోసం నగరానికి తరలి వచ్చినప్పుడు, మరింతగా ధూమపానం చేయడము ప్రారంభించాను. ఆహారం తినడం మరియు నిద్ర పోవటములాగా, ఇది నా జీవితంలో ఒక భాగం అయిపోయిందినేను ధూమపానం చేస్తున్నానని నా తల్లి తెలుసుకున్నప్పుడు, నేను దానికి బానిస అయిపోతానని ఆమె చెప్పింది. ఆమె నాకు, ధూమపానమును విడిచిపెట్టమని ఒప్పించేందుకు ప్రయత్నించింది. కొందరు వ్యక్తులు ధూమపానాన్ని వదిలేయాలని ప్రయత్నించినా, వారు వదలలేక పోతున్నారని నాకు తెలుసు. కానీ, నాకు ధూమపానం అనేది ఎప్పుడూ ఒక సమస్య కాదు అని నేను అనుకునేవాణ్ణి. నేను ఈ అలవాటును, ఎప్పుడు విడిచి పెట్టాలనుకుంటే అప్పుడు వదలగలను అని అనుకున్నాను.

నేను నిన్న సాయంత్రం, నా 5 సంవత్సరాల కుమార్తెను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాను. ఆమెకు  చాలా రోజుల నుంచి, దగ్గు మరియు శ్వాస తీసుకోవడములో కష్టంగా ఉంది. పొగ పీల్చుకోవడం వలన, బహుశా ఆమెకు ఆస్తమా వచ్చి ఉంటుందని, డాక్టర్ మాకు చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు, నేను మళ్ళీ సిగరెట్ ను ఎప్పటికీ తాగను అని నిర్ణయించుకున్నాను. నేను ఊహించిన దాని కంటే అది చాలా కష్టమైనది అని రుజువు చేసుకున్నాను. నా ధూమపానం చేసే అలవాటు, నా కుమార్తె యొక్క ఆరోగ్యానికి ఇంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బహుశా నేను తప్పుఅనుకుంటా, ధూమపానం నాకు సమస్యే.

ఈ కధలో రచయిత యొక్క కుమార్తెకు శ్వాసను తీసుకోవడములో కష్టంగా ఉండేది మరియు ఆమె తరచుగా దగ్గుతూ ఉండేది. పొగను పీల్చడం వలన కూడా, తరచుగా శ్వాస సమస్యలు రావచ్చును. సాధారణంగా ధూమపానం చేసేవారికి, చిన్న వ్యాయామం చేసిన తర్వాత కూడా ఊపిరాడకుండా (ఊపిరి తిరగకుండా) రొప్పు రావడము ప్రారంభించడాన్ని మీరు గమనించవచ్చు. ధూమపానం చేసే వారి ఊపిరితిత్తులు, ధూమపానం చేయని వారి ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఒకే రీతిగా ఉంటుందా?

 

ఒక ప్రయోగం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాము:

ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ముందు కొంత ఊహిద్దాం.

మీ ఊహను, నోట్సులో వ్రాయండి


 

[Contributed by administrator on 14. März 2018 20:01:58]