clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

3.2.2 ధూమపానం చేసే వ్యక్తుల ఊపిరితిత్తుల

ధూమపానం చేసే మరియు చెయ్యని వ్యక్తుల ఊపిరితిత్తుల సామర్థ్యం


మనము ఇలా ఊహించుకుందాము
"ధూమపానం చేసేవారి  ఊపిరితిత్తుల లాగా,  ధూమపానం చేయని వారి ఊపిరితిత్తులు పని చేయవు."

ఇప్పుడు మన అంచనా సరియైనదో, కాదో మనము పరీక్షించవలసి ఉంటుంది.

ధూమపానం చేసిన మరియు చేయని వారిలో ఊపిరితిత్తుల పనితీరును పరీక్షించడానికి మనము ఒక పరీక్షను చేయవచ్చును.

ఈ పరీక్ష కోసం మనకు కావలసినవి
 

ఒక పెద్ద (5 లీటర్ల) ప్లాస్టిక్ సీసా లేదా కంటైనర్,

ప్లాస్టిక్ సీసాకు సౌకర్యవంతంగా సరిపోయే ఒక బకెట్.

2 మీటర్ల రబ్బరు గొట్టం లేదా ప్లాస్టిక్ గొట్టం

250 మీ.లీ సిలిండర్ లేదా బీకర్ (కొలవడానికి)

చిన్న కాగితం ముక్కలు

టేప్

ఈ పరీక్షను చేయడానికి

  1. 5 లీటరు బాటిల్ మరియు కొలిచే సిలిండరును తీసుకోండి. కొలిచే సిలిండరును, 250 మి.లీ నీటితో పూరించండి. ప్లాస్టిక్ సీసాలో నీరు పోయండి. ఒక మార్కర్ తో, నీటి స్థాయిని 250 మిల్లీ లీటర్ల సమీపంలో  గుర్తించండి. మీ దగ్గర మార్కర్ లేకపోతే, ఒక చిన్న కాగితంలో 250 మి.లీ అని వ్రాసి, సీసాలో నీటి స్థాయికి దగ్గరగా అంటించ వచ్చును. మీరు ఒక టేప్ ను ఉపయోగించి,  ప్లాస్టిక్ సీసా కు కాగితమును అతికించ వచ్చును.

  2. నీటి స్థాయిని మార్కర్ తో, సీసా మీద వున్న కాగితపు ముక్క ఉదాహరణ/నిదర్శనము

  3. కొలత సిలిండరను ఉపయోగించి, 250 మిల్లీ లీటర్ల నీటిని మళ్ళీ వాడండి. మీరు ముందర     చేసినట్లుగానే కొత్త నీటి స్థాయిని గుర్తించండి. నీటికి సమీపంలో 500 మి.లీ అని వ్రాయండి.

  4. అదే విధముగా నీటిని కలుపుతూ, నీటి స్థాయిని గుర్తిస్తూ, మీరు 5 లీటర్ల వరకు నింపుతూ వుండండి. (5000 మి.లీ)water

  5. ఒక బక్కెట్టును నీటితో నింపండి. మీరు ప్లాస్టిక్ సీసాలో జోడించిన నీటికి తగినంత ఖాళీ స్థలమును కలిగి ఉండాలని గుర్తుంచుకోండి.

  6. సీసా యొక్క నోటి చివరను గట్టిగా మీ చేతితో పట్టుకొని, దానిని తలక్రిందులుగా బక్కెట్టులోకి  త్రిప్పండి. సీసా యొక్క మూతి, నీటిలో మునిగి వున్నప్పుడు, మీ చేతిని తొలగించండి. మీరు బకెట్ లో ఉంచినప్పుడు, మీ ప్లాస్టిక్ సీసా పూర్తిగా నిండి వుండేలా చూసుకోండి.  మీరు బకెట్ లోపల ఉంచడం మూలంగా కొంత నీరు బయటకు వచ్చేస్తే, ఆ ప్లాస్టిక్  సీసాను కొంచెముగా వంచండి. దీని మూలముగా నీరు లోపలకి పోయే అవకాశము ఉంటుంది.

  7. ప్లాస్టిక్ గొట్టాల యొక్క ఒక చివరను సీసా నోటిలోకి ఉండేలా చూడండి.

  8. ట్యూబ్ యొక్క అవతలి చివరను శుభ్రము చేయండి.

  9. ఇప్పుడు మీ ఊపిరితిత్తులు ఎంత గాలిని నింపుకోగలుగుతోంది అనేది పరీక్షించడానికి, మీ ముక్కును గట్టిగా అదిమి పట్టుకుని, మీరు వీలయినంత లోతుగా ఊపిరిని తీసుకోవడము, గొట్టంలోకి వీలయినంత వదలడము చేయడానికి ప్రయత్నము చేయండి.  

  10. మీరు గొట్టంలో ఊపిరిని వదిలి పెట్టడము మొదలుపెట్టినప్పుడు, గాలి ప్లాస్టిక్ సీసాలోకి వెళ్తున్నట్టుగా గమనిస్తారు.
    smokingexp

  11. గాలిని బయటకు వదిలిన తరువాత, గాలి ఎంతవరకు ప్లాస్టిక్ సీసాలో నింపబడినదో మార్కు చేయండి.

  12. మార్కు దగ్గర ఉన్న విలువను బట్టి, మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని సూచిస్తుంది.

  13. ధూమపానం చేస్తున్న కొందరు వ్యక్తులకు, ఈ పరీక్షను తీసుకోమని సలహా ఇవ్వవచ్చును. దీనిని బట్టి మీరు వారి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యమును గమనించవచ్చు. ఇప్పుడు మీరు పొగ త్రాగని వారిని కొంతమందిని పరీక్ష చేసి వారి ఊపిరితిత్తుల సామర్థ్యాలను కూడా గమనించండి.

    ఇక్కడ మీ పరిశీలనలను గమనించండి. మీరు ఒక పట్టికను తయారు చేయుట ద్వారా, మీ ఫలితాలను గమనించవచ్చు.

[Contributed by administrator on 14. März 2018 20:02:04]