clix - Health and Disease
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Health and Disease

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Approach note telugu

విద్యార్ధులు వ్యక్తిగత అనుభవాల ద్వారా లేదా ఇతరుల అనుభవాల ద్వారా ఆరోగ్యం యొక్క వివిధ అంశాల గురించి తెలుసుకుంటారు. పాఠశాల స్థాయిలో చాలా రకాల అవగాహన ప్రచారాలు మరియు ఆరోగ్య కార్యక్రమాల వలన, విద్యార్థులకు ఆరోగ్యం గురించి సమాచారమును పొందటానికి  దోహదం చేస్తున్నాయి. ఈ  మాడ్యూల్, విద్యార్ధులకు వారికి ఉన్న జ్ఞానాన్ని ప్రతిబింబించేలా ప్రోత్సహిస్తుంది మరియు వారు తెలుసు కోవాలనుకునే విషయాల గురించి ప్రశ్నలను అడిగేలా చేస్తుంది. ఈ మాడ్యూల్ విద్యార్థులకు, ఆరోగ్యమును  మరియు కొన్ని చిన్న స్వతంత్ర ప్రాజెక్టుల ద్వారా వ్యాధులను అన్వేషించడానికి రూపొందించబడింది, ఇది వారి సమాజంలో సర్వేలను మరియు కొన్ని ప్రయోగాత్మక ప్రయోగాలను కలిగి ఉంటుంది.

మాడ్యూలులోని అంశాలు 
విద్యార్థి చేయు ప్రాజెక్ట్
నిదర్శనా అధ్యయనం
తమ పరిసరాల నుండి సేకరించిన నమూనాలతో చేయు ప్రయోగాలు 
చింతన ప్రయోగాలు
అంకాత్మక పారస్పరిక (డిజిటల్ ఇంటరాక్టివ్)

ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థులకు పరిశీలించు మరియు పరిశోధనాత్మక సిద్ధాంతములను ప్రదర్శించు అవకాశం లభిస్తుంది. 

మాడ్యూల్లో మూడు యూనిట్లు ఉన్నాయి
1. ఆరోగ్య భావన
2. శాస్త్రీయ కోణము ద్వారా మలేరియా చరిత్ర
3. ప్రాజెక్ట్ పని
4. ఏ డేటా మాకు చెబుతుంది?

  మొదటి యూనిట్లో, విద్యార్థుల సామాజిక, భౌతిక మరియు మానసిక ఆరోగ్యం యొక్క అవగాహన గురించి మనము మాట్లాడుతాము. ఆరోగ్యమును ఈ మూడు కోణాల్లో ఎలా వ్యాప్తి చేయవచ్చు అనే దాని గురించి మంచి అవగాహన పొందడానికి, విద్యార్థులు వారి వారి కమ్యూనిటీలలో సర్వేను నిర్వహిస్తారు.

తదుపరి యూనిట్లో, మనము మలేరియా యొక్క ఆవిష్కరణ గురించి మాట్లాడతాము. ఇది శాస్త్రీయ కథా రూపములో ఆలోచనాత్మక ప్రయోగాలు మరియు ప్రయోగాత్మక ప్రయోగాల మధ్య ఉంటుంది. చివరి యూనిట్లలో విద్యార్థుల కోసం జరిగే దర్యాప్తుల కొరకు ఇది ఒక టెంప్లేట్ లాగా  పరిగణించ బడుతుంది. చివరి యూనిట్ లో, మాడ్యూల్ లో సూచించిన నాలుగు పరిశోధనా ప్రాజెక్టులలో ఒక దానిపై విద్యార్థులు పని చేస్తారు. ఈ యూనిట్ ముగిసే సమయానికి విద్యార్థులు, తమ పూర్తి స్థాయికి ప్రాజెక్టు పనిని చూపించ వలసి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పని గ్రూపుగా జరుగుతుంది.

మనము విద్యార్థుల చేత చేయబడే శాస్త్రీయ పరిశోధనల ప్రక్రియలో, సులభతరము చేయడానికి ఉపాధ్యాయుల పాత్రను దోహదకారులుగా ఊహించాము. ప్రశ్నలు అడగడానికి విద్యార్ధులను క్లాసులో ప్రోత్సహించడము, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వ్యూహాలు రూపొందించేలా చేయడము,  చర్చలను సులభతరం చేయడానికి మరియు విద్యార్థులకు వారికి ఇచ్చిన పనిని చూపించడానికి మార్గ నిర్దేశము చేయడము, అనేవి ఉపాధ్యాయుల యొక్క కీలక బాధ్యతలు. ఊహించిన మాడ్యూల్ యొక్క  ఫలితము ఏమిటి అంటే, ఇతరులకు జరిగే విషయాలు మాత్రమే కాకుండా, విద్యార్థులకు శాస్త్రీయ విధానముతో ఆరోగ్యము, వ్యాధిని నయం చేయటము మరియు వ్యాధిని నివారించడం వంటి వాటికి సహాయము చేసినట్లు అవుతుంది. ఈ మాడ్యూల్ విద్యార్థులను, వాస్తవ ప్రపంచ సమస్యల పై శాస్త్రీయ విచారణ ప్రక్రియను అనువర్తింప చేస్తూ, ఆరోగ్యానికి సంబంధించిన మరియు శ్రేయస్సు కొరకు ప్రోత్సహిస్తుంది. మాడ్యూల్ కొన్ని వ్యాధులను మాత్రమే చర్చిస్తున్నప్పటికీ, విద్యార్థులకు అదే ప్రక్రియను ఇతర ప్రబల వ్యాధులు మరియు కొత్తగా వచ్చే వ్యాధులు గురించి ఆలోచించటానికి  ఉపయోగించు కోవటానికి అవకాశము ఉంటుంది. 

 
[Contributed by administrator on 14. März 2018 19:58:08]