clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Lesson 1 - పర్యావరణ వ్యవస్థ అన్వేషణ

పర్యావరణ వ్యవస్థ అన్వేషణ


స్కూలు పరిసరాల్లో అటూ-ఇటూ తిరుగుతున్నప్పుడు,  అన్ని మూలలూ లేదా Lesson
అన్ని ప్రదేశాలూ                                                                                                                            

ఒకేలా లేవని మీకు అనిపించి ఉండవచ్చును.  
కొన్ని మూలల్లో గడ్డి పెరిగి ఉంటుంది.  పొదలు లేదా కలుపుమొక్కలు పెరిగిఉంటాయి.  
లేదా కొన్ని ప్రదేశాల్లో రాళ్ళూ-రప్పలూ నిండి ఉంటాయి.  అక్కడ పచ్చదనం ఉండదు.  
వర్షాకాలంలో అయితే ఎన్నోసార్లు కాంక్రీటు కొత్త గోడల మీద కూడా మొక్కలు పెరగనారంభిస్తాయి.  
ఏ మూలల్లో అయితే తడి లేదా చెమ్మ ఉంటుందో అక్కడ అధిక మోతాదులో పురుగూ పుట్రా, దోమలు ఉంటాయి.

 

మీరు ​జాగ్రత్తగా గమనించి ఉంటే వేర్వేరు స్థానాలు,
వివిధ మూలలు వైరుధ్యంతో కనబడడమే కాకుండా - అవి రకరకాల వనస్పతులు, మొక్కలు,
క్రిమికీటకాలు జంతుజాలానికి ఆలవాలమై, అవి ఎదగడానికి తోడ్పడుతూ ఉండడం తెలుస్తుంది.

 

స్కూలు​ పరిసరాల్లో లభ్యమయ్యే వైవిధ్యం , అడవుల్లోనూ - లేదా చెరువుల్లోనూ కనబడే వైవిధ్యం కంటే
భిన్నంగా ఉంటుందా?

 

రిభ్రమణం

 

వైవిధ్యం ​- సజీవమైనవి/నిర్జీవమైనవి - వాటి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడానికి మనం మన స్కూలు పరిసరాల్లోనే తిరుగుదాం.   పరిభ్రమణం అనగా తరగతి గది దాటి వచ్చి దాని బయట ఉన్న ప్రపంచాన్ని చూడడం.  వస్తువులు, జీవజంతువుల గురించి సమాచారం సేకరించాలి.  తరగతి గదిలోకొచ్చి ఆ సమాచారాన్ని ఒక క్రమంలో పెట్టాలి.

 

జాగ్రత్తలు:

  1. ఏ ​పురుగునూ, కీటకాన్ని చేత్తో ముట్టుకోకూడదు.  ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో దానిని దూరం నుండే పరిశీలించాలి.

  2. నది,​ చెరువు, చెలమల ఒడ్డుకి ఒంటరిగా వెళ్ళొద్దు.  ఈ సమయంలో ఉపాధ్యయుడు మీ కూడా ఉండడం అవసరం.

  3. బయట​ నిలిచి ఉన్న నీటిలో ఆడకండి.  అక్కడ దోమలు వగైరాలుంటాయి.  అందుకని పరిభ్రమణం ఉన్న రోజులలో పూర్తిచేతుల చొక్కా, పాంటు, ఆడపిల్లలు సల్వార్ కుర్తా వంటివి వేసుకుంటే మంచిది.

 

అవలోకనబయట ఏం కనిపించినా దానిని మీ పట్టికలో నోట్ చేసుకోవాలి                       Lesson                                                                    
అంటే సాలెపురుగు కనిపిస్తే ....
 

 

• అది గోడ మీద ఉందా?  లేక గూడులో ఉందా?

• ఆ సాలెగూడులో ఏమేం కీటకాలు ఇరుక్కుని ఉన్నాయి?

• కీటకాలు ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి?

• సాలెగూడు అల్లడానికి సాలెపురుగు ఒక మూలనే ఎందుకు ఎంచుకుంది?

 


ఇదే విధంగా మట్టిని చూడండి.  రాళ్లని చూడండి.

 


• మట్టిలో కూడా ఏదన్నా కీటకం ఉందా?

• మట్టిలో ఏ విధమైన వనస్పతి ఉంది?

• ఏ విధమైన రాళ్ళు లేదా కంకర మనకి కనబడుతున్నాయి?

• మట్టిలో ఎండిన కుళ్ళిన ఆకులు పడి ఉన్నాయా - గడ్డి కూడా ఉందా?

• వీటికి అక్కడేం  పని ఉండచ్చు?

 

ఒకవేళ నీళ్ళు కనిపిస్తుంటే...

 

• నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? లేక మురికిగా ఉన్నాయా?

• అందులో ఎలాంటి కీటకాలున్నాయి?

• అవి ఆ నీటిలోనే నివసిస్తున్నాయా?

 


ఒకవేళ తేనెటీగ కనబడితే ...
 

• తేనెటీగ ఎక్కడికి ఎగురుతోంది?

• ఎగురుతున్నప్పుడు అది ఎక్కడ కూచుంటుంది ?

• అక్కడ ఎందుకు కూచుని ఉండవచ్చును?

• దాని పట్టు ఎక్కడ ఉంది?

• చెట్టు వల్ల దానికేమన్నా ఉపయోగం ఉందా?  లేదా?


ఒకవేళ చెట్టు కనబడితే ...

 

• చెట్టు వేర్లు ఎక్కడున్నాయి?

• చెట్టు చుట్టుపక్కల ఉన్న మట్టి ఎలా ఉంది?

• చెట్టు మీద పక్షులున్నాయా?  ఎటువంటి పక్షులున్నాయి?

• చెట్టు మీద ఇతర పురుగులు వగైరాలున్నాయా?

• గాలి వల్ల చెట్టుకేమన్నా లాభం ఉందా?


 


ఏదైనా​ ప్రదేశంలో కనబడే జీవజంతుజాలం, అక్కడ నిర్జీవంగా కనబడే వస్తువుల మధ్య ఏదైనా సంబంధం ఉంటుందా?

 

 

ఎక్కడ నుండీ కనుగొనబడినది

(నివాసం)

నిర్జీవమా? సజీవమా?

అవును అయితే భోజనం ఎక్కడ నుండి దొరుకుతుంది?

ఎవరి వద్ద నుండి లభిస్తుంది?

చెట్టు 

       
         

రాతి ముక్క

       
         

గడ్డి

       
         

ప్లాస్టిక్

       
 

 

నువ్వు ఒక చక్రంలో (క్రమంలో) ఆ వస్తువులకు - కీటకాలు, జంతువులు, వనస్పతి, మట్టి, రాళ్ళు వంటివి ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లు నిరూపించగలవా? 
 

నువ్వెక్కడైనా నిలబడి చూడు... శ్రద్ధగా గమనిస్తే - సజీవ-నిర్జీవ పదార్ధాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడాన్ని గమనించవచ్చును.  వాటి మధ్యన అంతర-సంబంధం ఉంటుంది.  మీరు ఈ సంబంధాన్ని మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా చూడవచ్చును.  కేవలం ఒక చెట్టు తోనే ఈ తంత్రాన్ని గమనించవచ్చును.  కావాలనుకుంటే మీరు ఒక చెరువునే తంత్రంగా భావించి, అంతర-నిర్భరతను శోధించవచ్చును.

 

ఈ తంత్రం ఒకదానికొకటి దూరంగా ఉన్నట్లు, విభిన్నంగానూ కనబడవచ్చును.  ఇందులో ఉంటున్న సజీవాలు కూడా భిన్నంగా కనబడ వచ్చును.  ఏదైనా ఒకటి పరివర్తనం చెందితే దాని ప్రభావం రెండవ తంత్రం మీద కూడా పడవచ్చును.  అంటే ఉదాహరణకి, చెరువులో నీరు ఎండిపోతే అందులో ఉంటున్న జలచరాలు మరణిస్తాయి.  అలాగే చుట్టుపక్కలనున్న భూమి పైనున్న చెట్లు కూడా ఎండిపోతాయి .

ఈ తంత్రాన్ని మనం పరిస్థితుల ప్రభావం అనచ్చును.  ఇందులో సజీవ-నిర్జీవ పదార్ధాలు రెండూ ఉంటాయి.  ఈ తంత్రంలో సజీవ-నిర్జీవాల మధ్యన ఒక అంతఃక్రియ నడుస్తూ ఉంటుంది.   వాటి మధ్య పరస్పర నిర్భరతా వాతావరణం ఉంటుంది.​

ఏ పరిస్థితిలోని తంత్రంలోనైనా రెండు విధాలైన సజీవాలు ఉంటాయి.  ఒకటి మనం చూడగలిగేవి - అంటే పక్షులు, క్రిమికీటకాలు ఇత్యాది.  రెండవది అత్యంత సూక్షమమైనది.  అది మన కళ్లకి కనబడదు.  ఒక చదరం సెంటీమీటరు మట్టిలో వేలాది సూక్ష్మజీవులుంటాయి.  సజీవ-నిర్జీవాలు ఏవైతే మనకి భూమి పైన కనబడుతున్నాయో, అదే విధంగా భూమి కింద కూడా ఉంటాయి. నిర్జీవాల్లో మనం ఎండ, గాలి, రాళ్ళు వంటివాటిని చేర్చవచ్చును.  పరిస్థితి తంత్రంలో మనం ఈ రెండింటి మధ్యనా అంతరసంబంధాన్ని, పరస్పర నిర్భరతను చూడవచ్చును.

 ​
                                                                                                                                                                   ​

                                                        సూక్ష్మ జీవులు(బాక్టీరియా​) యొక్క కొన్ని వీడియోలు చూద్దాం

 ​
[Contributed by administrator on 10. Januar 2018 21:33:08]