clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Lesson 4: నిర్జీవ ఫ్యాక్టర్ ని కొలవటం: ఆక్సిజన్

నిర్జీవ ఫ్యాక్టర్ ని కొలవటం: ఆక్సిజన్

అన్ని​ జీవాలు (కొన్ని బ్యాక్టీరియాలు మినహా) జీవించటానికి ఆక్సిజన్ అనేది ఒక ప్రధానమైన నిర్జీవ ఫ్యాక్టర్. భూగోళ జీవాలు తాము పీల్చే గాలి నుంచి ఆక్సిజన్ ని పొందుతాయి. ఆక్సిజన్ వాయువు అయినప్పటికీ అది నీటిలో కరగగలదు మరియు చేపలు వంటి జలచరాలు తాము జీవించే నీటిలో కరిగిన ఆక్సిజన్ ని వినియోగించుకుంటాయి.

ర్యావరణంలో ఆక్సిజన్ పదార్థం తగ్గిపోతే జీవులు ఊపిరాడక చనిపోవచ్చు (జీవావరణ వ్యవస్థల రకాల పాఠంలో ఇచ్చిన అక్వేరియం వీడియోలో చూడండి). అక్వేరియంలో  , గాలి బుడగల్ని ఉత్పత్తి చేసే పంపు ఆక్సిజన్ స్థాయిని నిర్వహిస్తుంది మరియు చేపల ఊపిరాడని పరిస్థితి నుంచి కాపాడుతుంది.
ఈ​ క్రింది ప్రయోగంలో నీటిలో కరిగిన ఆక్సిజన్ మొత్తాన్ని మనం కొలుద్దాం.
సాధారణంగా ఈ రకమైన ప్రయోగానికి ఆధునిక ప్రయోగశాల అవసరం. అయితే మేము మీకోసం సరళంగా చేసాం మరియు మీరు మీ తరగతి గదిలోనే ప్రయోగశాలని చేయవచ్చు. నీటిలో కరిగిన ఆక్సిజన్ ని కొలవటానికి మనం ఉపయోగించే పద్ధతిని వింక్లర్స్  పద్ధతి అంటారు.
 

కావల్సిన సామగ్రి

 
ఈ​ కార్యకలాపాన్ని నిర్వహించటానికి మీకు ఈ క్రింది వస్తువులు అవసరం.
( పే​రుతో పాటు ఈ క్రింది సామగ్రి చిత్రాల్ని కూడా దయచేసి చూపించండి)

 
           బీఓడీ సీసా                                             సిరంజ్                                                        టెస్ట్ ట్యూబ్
                                                           1 మిలీ                             5 మిలీ

DO   Syrine1ml  syringe5ml  testtube


                                                                                      కాగితం కప్పు                              
                                                                                    papercup    

రసాయనాలు: ఈ క్రింది రసాయనాల ద్రావణాలు

మాంగనీస్ సల్ఫేట్

ఆల్కలైన్ పొటాషియం అయోడైడ్

ఫాస్ఫారిక్ యాసిడ్

గంజి

సోడియం థియోసల్ఫేట్

నీరు
ఏ​దైనా సహజమైన జలాశయం నుంచి సేకరించిన 2 లీటర్ల నీరు
15 నిముషాలు మరిగించిన తర్వాత చల్లారిన 2 లీటర్ల నీరు
గ్రూపు ​​సాధన
పూర్తి ​తరగతి 6 విద్యార్థులుగా విభజించబడుతుంది. ప్రతీ టీం ఏ లేదా బి పేరుని ఎంచుకుంటాయి.
స​హజమైన జలాశయం నుంచి సేకరించబడిన  నీటిని టీం ఏ ఎంచుకుంటుంది.
15 నిముషాలు మరిగిన తర్వాత చల్లారిన నీటిని టీం బీ ఎంచుకోవాలి.​
 
 
 ​విధంగా మొత్తం గ్రూపుల సంఖ్యలో సగం సహజమైన జలాశయం నుంచి సేకరించబడిన నీటిని ఉపయోగిస్తారు మరియు తక్కిన సగం మంది కనీసం 15 నిముషాలు మరిగి చల్లారిన నీటిని ఎంచుకుంటారు.
 

నీటిని పరీక్షించటానికి స్టెప్స్

            స్టెప్ 1 

నీటిలోక సీసాని నెమ్మదిగా ముంచటం ద్వారా నీటి శ్యాంపిల్ తో బీఓడీ సీసా నింపండి. నీటి శ్యాంపిల్ లో గాలి బుడగలు ఏర్పడకుండా జాగ్రత్తవహించండి. గాలి బుడగలు ఉన్నట్లైతే లోపం ఏర్పడుతుంది. కాబట్టి నీటి లోపలే మూత మూసివేయాలి.

స్టెప్ 2
 

మూతని​ జాగ్రత్తగా తెరవాలి మరియు 4 చుక్కల మాంగనస్ సల్ఫేట్ చేర్చండి.

స్టెప్ 3 4 చుక్కల ఆల్కలైన్ పొటాషియం అయోడైడ్ ద్రావణం చేర్చండి.
స్టెప్ 4

మూతని గట్టిగా మూసివేయాలి మరియు నీటిని బాగా కదపాలి. బీఓడీ సీసాలో నీటిలో పూర్తిగా గోధుమ రంగు పదార్థాలు ఉన్నట్లుగా మీరు గమనించే ఉంటారి, అవి సీసా అడుగు భాగానికి వచ్చేలా చేయండి.

స్టెప్ 5

ఇప్పుడు 10 చుక్కల ఫాస్ఫరిక్ యాసిడ్ చేర్చండి. మూతని గట్టిగా బిగించండి మరియు సీసాని కదపండి. గోధుమ రంగు పదార్థాలు కరిగిపోయేలా జాగ్రత్తవహించండి.

స్టెప్ 6

మీ 5 మిలీ సిరంజ్ ఉపయోగిస్తూ 5 మిలీ ద్రావణాన్ని బీఓడీ సీసా నుంచి టెస్ట్ ట్యూబ్ లోకి మార్చండి.

స్టెప్ 7

టెస్ట్ ట్యూబ్కి 2 చుక్కల స్టార్చ్ ద్రావణాన్ని చేర్చండి. ఇప్పుడు మీ ద్రావణం నీలంగా మారుతుంది.

స్టెప్ 8 1 మిలీ సిరంజిలో 1 మిలీ సోడియం థియోసల్ఫేట్ ద్రావణం తీసుకోండి.
స్టెప్ 9

నీలంరంగు కనబడనంత వరకు టెస్ట్ ట్యూబ్ లోకి ఒక్కొక్క చుక్క  సోడియం థియోసల్ఫేట్ ద్రావణం నెమ్మదిగా చేర్చండి.  టెస్ట్-ట్యూబులో రంగురహితంగా ద్రావణాన్ని మార్చేందుకు సోడియం థియోసల్ఫేట్ ద్రావణం మొత్తాన్ని గురించి రాసుకోవాలి.

స్టెప్ 10

ప్రయోగం చేసిన తర్వాత సిరంజిలో మిగిలిన సోడియం థియో సల్ఫేట్ ద్రావణం తిరిగి ఉంచండి.

స్టెప్ 11            

ద్ధతిని  అర్థం చేసుకోవటానికి ఈ క్రింద ఇవ్వబడిన వీడియోని జాగ్రత్తగా చూడండి.                 

 ​
 

లెక్కింపు

 
నీ​టిలో ఉన్న ఆక్సిజన్ ని లెక్కించటానికి ఈ క్రింద ఇచ్చిన సూత్రాని దయచేసి ఉపయోగించండి
 
1 లీటరు నీటిలో కరిగిన ఆక్సిజన్ ( మిగ్రా/లీటరు) = ఉపయోగించిన సోడియం థియోసల్ఫేట్ ద్రావణం పరిరమాణం x80.
 
                                                            =.... మి​గ్రా/నీటిలో ఆక్సిజన్ లీటరు.

ప్రయోగాన్ని అర్థం చేసుకోవడానికి వీడియోను చూడండి​

 

 



[Contributed by administrator on 10. Januar 2018 21:33:25]