clix - Ecosystem
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Ecosystem

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

Lesson 7 - కార్యకలాపం 2

కార్యకలాపం 2: వానపాములు మరియు వ్యవసాయ జీవావరణ వ్యవస్థలు


వానపాములు​ వ్యవసాయ జీవావరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. అవి క్షీణించే మొక్కని మరియు జంతువుల పదార్థాల్ని తింటాయి మరియు కుళ్లిపోయేలా చేయటంలో సహాయపడతాయి. రంధ్రం చేసే వాటి కార్యకలాపం మట్టిలో గాలి చొరబడటాన్ని పెంచుతుంది మరియు మొక్కలు ఉపయోగించే  మట్టిలో లోతుగా ఉన్న ఖనిజాలు మరియు ఇతర పోషకాల్ని పైకి తీసుకువస్తుంది. ఎర్త్ వర్మ్ కాస్ట్స్ గా పిలువబడే  వాటి విసర్జనలో నత్రజని మరియు ఫాస్ఫరస్ ల పరిమాణం కావల్సినంత ఉంటుంది. అవి మొక్కల ఎదుగుదలకు ప్రధానం.  మట్టికి వానపాముల సంఖ్య ఎక్కువగా ఉంటే పంట ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుందని తెలిసిన వాస్తవామే. వర్మ్ కాస్ట్స్ ఉత్పత్త చేయటానికి ప్రజలు వానపాముల్ని పెంచుతారు. ఇది తోట మరియు పంటల్లో మొక్కలుగా ఎరువుగా ఉపయోగించబడుతుంది. వానపాముల పెంపకాన్ని వర్మి కల్చర్ అంటారు.  

వానపాము​ యొక్క కొన్ని వీడియోలు చూద్దాం.

​​

 

వర్మికంపోస్ట్ ని తయారు చేసే తోటమాలి/రైతు లేదా ప్రజలతో దయచేసి మాట్లాడండి మరియు ఈ క్రింది సమాచారం సేకరించండి.

 

వారు​ కంపోస్ట్ ని ఎలా తయారు చేస్తారు

పొడి మట్టిలో వానపాములు ఎందుకు కనిపించవు

సేంద్రీయ ఎరువుని (ఉదా ఆవు పేడ) చేర్చటం వల్ల వానపాముల ఎదుగుదల పెరుగుతుందా

కృత్రిమ ఎరువుని (ఉదా యూరియా)చేర్చటం వల్ల వానపాములకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావం కలుగుతుందా.

[Contributed by administrator on 10. Januar 2018 21:33:18]