clix - Unit 1: The Earth
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
Profile picture for this group.
New profile photo
×
Unit 1: The Earth

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

కార్యకలాపం 1: జియోసింక్రన్

భూమి తన అక్షం చుట్టూ భ్రమణం చేస్తుందని మీకు తెలుసు. భూమి పైన ప్రతి బిందువులో అక్షం, వాతావరణ కదలికలో గాలి అణువులు సహా ఒక ఊహాజనిత రేఖ. దీనిని మనం ఒక కార్యకలాపం సహాయంతో అర్థం చేసుకుందాము.


(గమనిక: ఇది ఆరు బయట నిర్వహించే ఒక కార్యకలాపము. దయచేసి ఈ కార్యకలాపాన్ని ఉదయం లేదా మధ్యాహ్నం చివరి సమయంలో నిర్వహించండి తద్వారా మీరు ఎండలో నిలబడనక్కరలేదు.)

మెటీరియల్: గ్లోబ్, అయస్కాంత దిక్సూచి, కోణమాని, పిండి ముద్ద మరియు అగ్గి పుల్లలు


ప్రక్రియ:

  1. ఒక మైకు స్టాండుకి గ్లోబుని జతచేయండి.
  2. ధృవ నక్షత్రాన్ని (మీరు ధృవ నక్షత్రం ఉపయోగిస్తే, మీరు దీనిని ముందు రోజు రాత్రి నాడు లేదా 'స్కై వ్యూ' అనే మొబైల్ యాప్ సహాయంతో చేయాలి) లేదా ఒక అయస్కాంత దిక్సూచి ఉపయోగించి ఉత్తరాన్ని గుర్తించండి మరియు గ్లోబు యొక్క అక్షాన్ని ఉత్తరం-దక్షిణం దిశలో నిలబెట్టండి1.
  3. భూమి పైన ఏ ప్రదేశంలో అయినా, ధృవ నక్షత్రాన్ని అక్షాంశానికి సమాన  మైన కోణంలో చూడాలి. మీ ప్రదేశం యొక్క అక్షాంశానికి సమానమైన కోణంలో గ్లోబుని వాలుగా ఉంచండి (చిత్రం 1 చూడండి). (అక్షాంశాలు: హైదరాబాద్: 17°, ముంబై: 19°, జైపూర్: 27°)
  4. జియోసింకర్ని సూర్య కాంతి క్రింద ఉంచండి మరియు ఇండియా పైన ఉండేట్లు తిప్పండి.
  5. ఇప్పుడు ఒక అగ్గిపుల్లని తీసుకోండి. అది ఒక మానవుడిని తెలుపుతుందని అనుకుందాము. అగ్గిపుల్ల తల మానవుని తలని తెలుపుతుంది. గ్లోబు పైన పిండి ముద్ద సహాయంతో మీ ప్రదేశానికి అతి సమీపంలో అగ్గి పుల్లని ఉంచండి. అగ్గిపుల్ల గ్లోబుకు నిలువుగా ఉండాలని, మనతో కాదని (దానిని వ్యాసార్ధం లాగు అతికించండి) గుర్తుంచుకోండి.
  6. ఇప్పుడు గ్లోబు తలం పైన అగ్గిపుల్ల యొక్క నీడని మరియు మీ నీడలు లేదా సమీపంలో ఉన్న వస్తువులను, ఒక స్తంభం, స్థూపం లేదా భూమి తలం పైన ఒక చెట్టు నీడలు పరిశీలించండి. అవి సమాంతరంగా ఉన్నాయా?
                                                                              
Geosynchron

చిత్రం 1: జియోసింక్రన్


1భౌగోళిక ఉత్తర ధృవం మరియు అయస్కాంత ఉత్తర ధృవం ఒకటి కాదు. మీ దిక్సూచి పట్టుకుని మీరు భౌగోళిక ఉత్తరం ధృవం పైన నిలబడినట్లైతే, అది ఉత్తర కెనడాని ఎల్లస్మిరె దీవి వైపు చూపుతుంది. భౌగోళిక ఉత్తరం మరియు అయస్కాంత ఉత్తర ధృవాల మధ్య దాదాపు 500 కిలోమీటర్ల వ్యత్యాసం ఉన్నది! అందువలన మనం ఉత్తరాన్ని ధృవ నక్షత్రంతో గుర్తించడం ఉత్తమము.

http://gisgeography.com/magnetic-north-vs-geographic-true-pole/



చర్చ కొరకు ప్రశ్నలు:

  1. గ్లోబు పైన అగ్గిపుల్ల యొక్క నీడ మరియు ధృవాల నీడలు లేదా సమీపంలో ఉన్న ఇతర నిలువు వస్తువుల నీడలు సమాతంరంగా ఉన్నాయి. అంటే మీ వాస్తవ ప్రదేశంలో సూర్యుని సమయాలు జియెసింకర్నులో మీ ప్రదేశంలో లాగే ఉన్నాయి.
  2. గ్లోబులో ఏ భాగం సూర్యకాంతిలో వెలుగుగా ఉన్నది? ఈ భాగంలో ఉన్న ప్రదేశాలలో అది పగలు సమయం. పగలు ఉన్న కొన్ని దేశాల పేర్లు నువ్వు చెప్పగలవా? ఇప్పుడు మధ్యాహ్నం అయిన ఒక దేశం పేరు నీవు తెలుపుతావా (సుర్యుడు నేరుగా ఆ దేశం పైన ఉన్న చోటు)? ఒక బిందువు నుండి సూర్యుడు తల పైన కనిపిస్తాడు కానీ ఆ బిందువు గుండా వెళ్లే రేఖాంశం పైన ప్రతి చోట మధ్యాహ్నం అవుతుంది2.
  3. ఇప్పుడు గ్లోబులో సూర్య కాంతి లేని భాగాన్ని (అంటే, చీకటి) గుర్తించండి. ఈ భాగంలో ఉన్న ప్రదేశాలలో ఇప్పుడు రాత్రి అయింది. మీరు ఈ భాగాన్ని జియోసింకర్నులో చూడవచ్చు ఎందుకంటే చుట్టూ కాంతి చెల్లాచెదురుగా ఉన్నది. వాస్తవ భూమిలో, చెల్లాచెదురుగా కాంతి లేదు. భూమి పైన ఉండే కాంతి చంద్రుడి నుండి పరావర్తనమైన సూర్యకాంతి నుండి మరియు ఇతర గ్రహాలు మరియు స్టార్ లైట్. 
  4. ఉత్తర ధృవం నుంచి చూసినప్పుడు, భూమి అపసవ్య దిశలో భ్రమణం చేస్తుంది3.దీనిని గుర్తుంచుకోవడానికి మీరు కుడి చేతి బొటనవేలి సూత్రము ఉపయోగించవచ్చు. కుడి చేతి బొటనవేలి సూత్రము:మీ కుడి చేయి బొటన వేలిని ఉత్తర ధృవం వైపు ఉంచినప్పుడు, మీ కుడి చేయి మడిచిన వేళ్ళ దిశ భూమి యొక్క భ్రమణ దిశ లాగే ఉంటుంది.
  5. నిదానంగా గ్లోబుని పశ్చిమం నుండి తూర్పుకి భ్రమణం చేయండి మరియు తూర్పులో ఉన్న దేశాలు ఎలా ఉన్నాయి మరియు ఎక్కడ క్రమంగా పగలు రాత్రిగా మారుతున్నది మరియు పశ్చిమంలో ఉన్న దేశాలు పగలుకి మరియు వారికి పగలు ఎలా అయిందో చూడండి. ఒక పూర్తి భ్రమణం ఒక పూర్తి రోజు జరగడాన్ని సూచిస్తుంది.
                                                              

2ప్రతి రోజు సూర్యుడు తలమీద వస్తాడు కానీ సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఉష్ణ మండల ప్రాంతంలో వస్తాడు మరియు ఉప ఉష్ణ మండల మరియు ధృవ ప్రాంతాలలో ఎన్నడూ రాడు.

3గ్లోబుని అదే పద్ధతిలో కదలిస్తూ ఉండండి మరియు దక్షిణ ధృవం నుండి చూసినట్లైతే భూమి సవ్య దిశలో తిరుగుతున్నట్లు మీరు గమనిస్తారు.



ఈ కార్యకలాపం    

మోంటీరో, వి., మహాశబ్దె, జి., బార్భాయ్, పి. (2008) నుండి గ్రహింపబడినది.సూర్యుడు- భూమి ప్రయోగాలు:పగటి పూట ఖగోళశాస్త్రం కొరకు కార్యకలాప కార్డులు. నవనిర్మితి
 

[Contributed by administrator on 10. Januar 2018 21:24:02]